అరటి పండ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే అరటి పండ్లు తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు అరటి పండ్లు తినడంతో గుండెకు ఆరోగ్యనికి మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే గర్భవతులు కూడా ఈ అరటి పండ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. అరటిపండ్లు త్వరిత శక్తిని అందించడంలో ముందంజలో ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. తద్వారా అలసట తగ్గుతుంది. అరటి పండు తినడం ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తుంది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది.ముఖ్యంగా విటమిన్స్ (విటమిన్ C, విటమిన్ B6), ఖనిజాలు (పొటాషియం, మాంగనీస్) మరియు డైటరీ ఫైబర్. అరటి పండు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, రక్త చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది మరియు శక్తిని త్వరగా అందిస్తుంది.
గర్భిణీ స్త్రీలకూ అరటి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త నిర్మాణానికి అవసరమైన ఐరన్, folate, విటమిన్స్ B6 అందిస్తుంది. అలాగే, అరటి పండు జీర్ణక్రియను సులభతరం చేసి, గర్భిణీలలో సాధారణంగా వచ్చే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదనంగా, దానిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు 1-2 అరటిపండ్లు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ తినడం వల్ల గ్లూకోజ్ స్థాయి పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. ముఖ్యంగా గర్భిణిలు అరటి పండ్లు తినాలకున్నపుడు.. ముందుగా ఆరోగ్య నిఫుణులు, డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.