ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
READ MORE: Mehbooba Mufti: ‘‘భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా లేదు’’.. మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు..
వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. “ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ”లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వేడినీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు నుంచి తేమ తొలగిపోతుందని, అలాగే సహజ నూనెలు కూడా తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్‌లోని చైనా మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ పెకింగ్కి చెందిన డాక్టర్ యాంగ్ పాల్గొన్నారు. వేడి నీరు జుట్టు కుదుళ్లలో ఉన్న సహజ నూనెలను తొలగిస్తుందని, దీని కారణంగా జుట్టు పొడిబారి పెళుసుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. వేడి నీరు స్కాల్ఫ్ ను పొడిగా చేస్తుందని.. తద్వారా దురద, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా.. జుట్టు మూలాలను కూడా బలహీనపరుస్తుందని.. ఫలితంగా జుట్టు చిట్లిపోయి, రాలిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరీ వేడి నీటితో కాకుండా.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.