NTV Telugu Site icon

Alcohol: మద్యం మత్తులో శృంగారం చేస్తున్నారా?

Alcohol

Alcohol

మద్యం పానం ఆరోగ్యానికి హానికరం.. అని ఎన్ని సార్లు చెప్పినా కొంత మంది పెడచెవిన పెడతారు. అయితే.. మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీని వల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది. అక్కడ అది అల్డిహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది. పొట్ట, పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంది. కాలేయం మనం తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి, ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి మలం, మూత్రం రూపాల్లో బయటకు పంపిస్తుంది.

READ MORE; Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అయితే.. శృంగారంలో పాల్గొనాలనే కోరిక మద్యం సేవించినప్పుడు ఎక్కువగా ఉంటుందని… దాని కోసమే తాగుతున్నామని కొందరు చెబుతుండటం గమనార్హం. ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మద్యం సేవించిన సమయంలో శృంగార కోరికలు కలిగినా… చేసే సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. తరచూ మద్యం సేవించే వారిలో శృంగారం చేసే సామర్థ్యం తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ మండలం మీద ఆల్కహాల్ ప్రభావంతో శృంగారం మీద ఆసక్తి క్షీణిస్తుందని పేర్కొన్నారు. బ్రిటన్ కు చెందిన పరిశోధకులు 280 మంది యువకుల మీద పరిశోధన చేయగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్నప్పటి కన్నా తీసుకోకుండా శృంగారం చేస్తేనే యువకులు ఎక్కువ సేపు ఆ పని చేసే సామర్థ్యం దక్కిందని పరిశోధనలో తేలింది.

READ MORE; Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!

అంతేకాదు మద్యం సేవించి నప్పుడు అసురక్షిత (కండోమ్ లేకుండా) విధానాల్లో శృంగారంలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని, అపరిచిత వ్యక్తులతో అసురక్షిత శృంగారం చేస్తే వ్యాధులు రావడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాదు కూల్ డ్రింక్స్ ఎక్కువ మొత్తంలో సేవించిన వారిలో కూడా శృంగార సామర్థ్యం తగ్గుతోందని, అమితంగా కూల్ డ్రింక్స్ తాగిన వారిలో శృంగారంలో వీక్ అవుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. శృంగార జీవితంలో సంతృప్తిగా గడపాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు తప్పని సరి అని, ముఖ్యంగా మద్యం, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే శ్రేయస్కరమని పరిశోధకులు చెబుతున్నారు.

Show comments