Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
- సొరకాయతో టేస్టీ గారెలు.. సింపుల్ రెసిపీ
- బయట కరకర.. లోపల మెత్తగా ఉండే టిప్స్
- 10 నిమిషాల్లో రెడీ అయ్యే స్నాక్ ఐడియా
- పిల్లలు కూడా ఇష్టపడే హెల్తీ ఆప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sorakaya Garelu Recipe in Telugu: సొరకాయతో ఎప్పుడూ కూరలే కాకుండా, ఇలా సాంప్రదాయ పద్ధతిలో కమ్మని సొరకాయ గారెలు ప్రయత్నించండి. ఇవి పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి అస్సలు నూనె పీల్చవు. బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఇవి అద్భుతంగా ఉంటాయి. వీటిని సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- సొరకాయ తురుము: 2 కప్పులు (లేత సొరకాయ అయితే రుచి బాగుంటుంది)
- బియ్యం పిండి: 2 నుండి 2.5 కప్పులు
- నానబెట్టిన పచ్చి శెనగపప్పు: పావు కప్పు
- పల్లీల పొడి: పావు కప్పు (వేయించి బరకగా గ్రైండ్ చేసినవి)
- పచ్చిమిర్చి పేస్ట్: 10-12 పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసినవి
- ఉల్లిపాయ తరుగు: 1 కప్పు
- కరివేపాకు, కొత్తిమీర: తగినంత
- నువ్వులు: 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
1. సొరకాయను సిద్ధం చేయడం:
ముందుగా లేత సొరకాయను తీసుకుని పైన చెక్కు తీసి శుభ్రం చేయాలి. దీన్ని పెద్ద రంధ్రాలున్న గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. ఒకవేళ తురుముకోవడం కష్టమనిపిస్తే, చిన్న ముక్కలుగా కట్ చేసి చాపర్‌లో వేసి సన్నగా చాప్ చేసుకోవచ్చు.
2. పిండిని కలుపుకోవడం:
ఒక పెద్ద గిన్నెలోకి సొరకాయ తురుము తీసుకుని, అందులో బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, నానబెట్టిన శెనగపప్పు , పల్లీల పొడి వేయాలి. సొరకాయలో సహజంగానే నీరు ఉంటుంది కాబట్టి ముందే నీళ్లు పోయకుండా చేత్తో గట్టిగా నలుపుతూ కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటేనే కొన్ని నీళ్లు చల్లి, చేతికి అంటుకోకుండా ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి.
3. గారెలు ఒత్తుకోవడం:
కలిపిన పిండి పైన తడి కాటన్ క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, అరిటాకు లేదా ఆయిల్ కవర్ మీద నూనె రాసి మీడియం మందంతో గారెల్లా ఒత్తుకోవాలి.
4. వేయించడం:
బాణలిలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. సిద్ధం చేసుకున్న గారెలను నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు (Golden Brown) వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి.
ముఖ్యమైన చిట్కాలు
- సొరకాయ లేతగా ఉంటే గారెల రుచి పెరుగుతుంది.
- పిండి పలచగా అయితే గారెలు నూనె పీల్చుకుంటాయి, కాబట్టి అవసరమైతే కొంచెం బియ్యం పిండిని అదనంగా కలుపుకోవచ్చు.
- ఇదే పిండితో మీరు ‘తపాల చెక్కలు’ లేదా ‘సర్వపిండి’ కూడా తయారు చేసుకోవచ్చు.
- సొరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కూరలు ఇష్టపడని పిల్లలకు ఇలా గారెలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!