Health: చలికాలంలో పుట్టగొడుగులు సూపర్ ఫుడ్.. తిన్నారంటే ఆ సమస్యలు రావు
- పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభ్యం
- చలికాలంలో పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది
- పుట్టగొడుగులు తింటే అనేక వ్యాధులను నివారిస్తుంది
- గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులతో రకరకాల వంటలు తయారు చేస్తారు. దీనిని.. సూప్, సలాడ్, స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. పుట్టగొడుగులో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. ఇది బరువును నియంత్రించి గుండె జబ్బులను నివారిస్తుంది.
Read Also: Skoda Kylaq: 4 వేరియంట్లలో “స్కోడా కైలాక్”.. రూ. 14.40 లక్షలకే టాప్ వేరియంట్
Also Read
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
- Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
పుట్టగొడుగులలో ఎర్గో థియోన్, గ్లూటాతియోన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి.. వాపుతో పోరాడుతాయి. అలాగే.. కీళ్లనొప్పులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు నిరోధిస్తాయి. పుట్టగొడుగులను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టగొడుగులలో సోడియం తక్కువగా ఉంటుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుట్టగొడుగులలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఫైబర్ లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ నార్మల్‌గా ఉంటుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్, చిటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎల్‌డిఎల్‌ను తగ్గించడంలో.. హెచ్‌డిఎల్‌ని పెంచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి బలపడుతుంది:
పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. శరీరం అంటువ్యాధులు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. షియాటేక్, మైటేక్ వంటి పుట్టగొడుగు రకాలు వాటి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి.
బరువు అదుపులో ఉంటుంది:
పుట్టగొడుగులో తక్కువ కేలరీలు, అధిక పోషకాలు ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. పుట్టగొడుగులలో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి ఆహార కోరికలను నియంత్రిస్తాయి. పుట్టగొడుగులు తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది.. శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి.
పేగు ఆరోగ్యం:
పుట్టగొడుగులలో ఉండే ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. జీర్ణక్రియకు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ అవసరం. పోషకాల శోషణ, రోగనిరోధక శక్తికి పుట్టగొడుగులు చాలా ముఖ్యం.
నోట్ : ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!