Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Diet: వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారినప్పటికీ తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఆహార పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తేమ కారణంగా సులభంగా కలుషితమయ్యే అవకాశం ఉండటంతో వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ కాలంలో సురక్షితంగా తీసుకోవచ్చని కొన్ని ప్రత్యామ్నాయ కూరగాయలను కూడా సూచించారు.
ఆకుకూరలు
పాలకూర వంటి ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ, వర్షాకాలంలో వీటిపై బ్యాక్టీరియా, మట్టి, ఇతర సూక్ష్మజీవులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. సాధారణంగా కడిగినా కొన్ని సూక్ష్మజీవులు పూర్తిగా తొలగకపోవచ్చని, దీంతో కడుపు ఇన్ఫెక్షన్లు లేదా ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
క్యాబేజీ, కాలీఫ్లవర్
క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల పొరలు, పుష్పాల మధ్య తేమ, మురికి, బ్యాక్టీరియా చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. వీటిని పూర్తిగా శుభ్రం చేయడం కొంత కష్టమైనందున వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా కడిగి వండాలని సూచించారు.
మష్రూమ్స్
మష్రూమ్స్ సహజంగానే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. అందువల్ల వర్షాకాలంలో ఇవి సులభంగా కలుషితమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. విశ్వసనీయమైన విక్రేతల వద్ద నుంచి మాత్రమే తాజా మష్రూమ్స్ కొనుగోలు చేయాలని, బాగా శుభ్రం చేసి పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలని సూచించారు.
మొలకెత్తిన బంగాళాదుంపలు
మొలకలు వచ్చిన బంగాళాదుంపల్లో ‘సోలనైన్’ అనే సహజ విషపదార్థం స్థాయి పెరుగుతుంది. అలాంటి బంగాళాదుంపలను తినడం వల్ల వికారం, తలనొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అందువల్ల మొలకలు వచ్చిన బంగాళాదుంపలను ఉపయోగించకుండా తాజావి మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో ఏ కూరగాయలు తినాలి..?
కొన్ని కూరగాయలను తగ్గించాల్సి వచ్చినా, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. సొరకాయ, బీరకాయ, దొండకాయ, మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి తక్కువ తేమ కలిగిన కూరగాయలు వర్షాకాలంలో తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పారు. ఇవి సులభంగా జీర్ణమవడంతో పాటు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని వివరించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!