Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
- Honor 600 Elite 5G వచ్చేసింది
- Snapdragon 4 Gen 4, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor 600 Elite 5G Launch: Honor సంస్థ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Honor 600 Elite 5G పేరుతో ఈ ఫోన్‌ను అధికారికంగా లిస్ట్ చేసింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Snapdragon 4 Gen 4 చిప్సెట్, 108MP ప్రధాన కెమెరా, భారీ 8,100mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బాడీకి కూడా కంపెనీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి.
Honor 600 Elite 5G ధర, లభ్యత
Honor 600 Elite 5Gను కంపెనీ అధికారిక వెబ్సైట్లో లిస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఫోన్ ధరను వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే Desert Gold, Velvet Black, Meteor Silver రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. త్వరలోనే ఫోన్ సేల్ తేదీ, ఇతర మార్కెట్లలో లభ్యతకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
- Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
- Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
- NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
- ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
Honor 600 Elite 5G డిస్ప్లే
ఈ ఫోన్లో 6.87 అంగుళాల TFT LCD డిస్ప్లే ఉంది. ఇది 1592 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 1,020 నిట్స్ వరకు HBM బ్రైట్నెస్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్స్, ఇతర రోజువారీ పనుల్లో డిస్ప్లే మరింత స్మూత్‌గా కనిపించే అవకాశం ఉంది.
Snapdragon 4 Gen 4 ప్రాసెసర్
పర్ఫార్మెన్స్ కోసం Honor 600 Elite 5Gలో Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌ను అందించారు. దీనికి 8GB ఫిజికల్ RAM, 256GB స్టోరేజ్ జత చేశారు. అదనంగా 16GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. దీంతో మొత్తం RAM సపోర్ట్‌ను 24GB వరకు విస్తరించుకోవచ్చు. ఫోన్ Android 16 ఆధారిత MagicOS 10.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
108MP కెమెరా
కెమెరా విషయానికి వస్తే Honor 600 Elite 5G వెనుక భాగంలో 108MP మెయిన్ కెమెరా ఉంది. ఇందులో f/1.75 అపర్చర్ అందించారు. దీనికి అదనంగా ఒక సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్లో పలు AI కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫొటోల ఆధారంగా వీడియోలను రూపొందించే AI ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది.
8,100mAh భారీ బ్యాటరీ
Honor 600 Elite 5Gలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దీని భారీ బ్యాటరీ. ఫోన్లో 8,100mAh బ్యాటరీ ఉంది. ఇది 45W Honor SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మన్నికపై Honor ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. Honor 600 Elite 5Gకి IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. దీంతో దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభించేలా దీనిని రూపొందించారు.
ఇతర ఫీచర్లు
సెక్యూరిటీ కోసం ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఆడియో కోసం వాల్యూమ్ బూస్ట్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, డ్యూయల్ నానో SIM, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.1, USB Type-C పోర్ట్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!