Sattu Laddu Recipe Without Sugar: పంచదార, పాకం లేకుండా హై ప్రోటీన్ సత్తు లడ్డూ.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sattu Laddu Recipe Without Sugar: తీపి పదార్థాలు తినాలని అనిపించినా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కెరకు దూరంగా ఉండాలనుకునే వారికి సత్తు లడ్డూ మంచి ఎంపిక. పంచదార లేకుండా, పాకం చేయాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో నిండుగా ఉంటాయి. వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో సత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సత్తుతో శర్బత్ లేదా పానీయాలు తయారు చేస్తారు. అయితే, అదే సత్తుతో తియ్యటి లడ్డూలు కూడా చేయవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటాయి.
కావలసిన పదార్థాలు
సత్తు (వేయించిన శనగపిండి) – 2 కప్పులు
దేశీ నెయ్యి – 1 కప్పు (అవసరమైనంత)
యాలకుల పొడి – 1/2 టీస్పూన్
బాదం, జీడిపప్పు, పిస్తా – సన్నగా తరిగినవి
పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు – కొద్దిగా
ఓట్స్ – 1 కప్పు
ఖర్జూరాలు – అవసరమైనంత (తీపి కోసం)
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
తయారీ విధానం
ముందుగా సత్తును ఒక పెద్ద గిన్నెలో వేసి, గడ్డలు ఉంటే వడకట్టాలి. తర్వాత ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో సత్తు పిండి వేసి తక్కువ మంటపై వేయించాలి. సత్తు నుంచి మంచి వాసన రావడం ప్రారంభమైన తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా, యాలకుల పొడి వేసి కలపాలి. పంచదారకు బదులుగా ఖర్జూరాలను మెత్తగా రుబ్బి పేస్ట్‌లా తయారు చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలకు సహజమైన తీపి వస్తుంది. మిశ్రమం బాగా కలిసేంత వరకు వేయించాలి. ఇంకో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, బాదం ముక్కలు స్వల్పంగా వేయించాలి. అందులో ఓట్స్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పొడి చేసి సత్తు మిశ్రమంలో కలపాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో గుండ్రంగా ఉండలు చేయాలి. అంతే.. పంచదార లేకుండా, హై ప్రోటీన్‌తో నిండిన సత్తు లడ్డూలు సిద్ధం.
ఆరోగ్య ప్రయోజనాలు
సత్తులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో శరీరానికి శక్తి అందుతుంది. ఖర్జూరాలు సహజ తీపిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్, గింజలు పోషకాలు అందిస్తాయి. ఓట్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి ఉదయం అల్పాహారం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో ఉంచితే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఆరోగ్యకరమైన తీపి కావాలనుకునే వారు తప్పక ఈ సత్తు లడ్డూ ట్రై చేయండి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!