Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి – బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే ఎంతో సులువుగా చేసుకోగలిగే ఈ హెల్తీ కుకీస్ తయారీ విధానం, దానికి కావలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు (Ingredients):
వెన్న (Butter) – ½ కప్పు
బెల్లం పొడి – ½ కప్పు
రాగి పిండి – ½ కప్పు
గోధుమ పిండి – ½ కప్పు
ఉప్పు – ఒక చిటికెడు
బేకింగ్ పౌడర్ – ½ చిన్న చెంచా
పాలు – 3 పెద్ద చెంచాలు
వెనిలా ఎసెన్స్ – 1 చిన్న చెంచా
Also Read
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో వెన్న, బెల్లం పొడి వేసి హ్యాండ్ మిక్సర్ లేదా విస్కర్ సహాయంతో మిశ్రమం మెత్తగా, దూదిలా తేలికగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే రాగి పిండి, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి స్పూన్ లేదా స్పాచులాతో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పాలు, వెనిలా ఎసెన్స్ వేసి మెత్తటి ముద్దలా (పిండిలా) కలుపుకుని, ఆ పిండిని 15-20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ లోపు ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ-హీట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బేకింగ్ ట్రేపై బటర్ పేపర్ పరుచుకోవాలి. ఫ్రిజ్ నుంచి తీసిన పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చేత్తో కొద్దిగా ఒత్తుతూ కుకీస్ ఆకారంలోకి తెచ్చుకోవాలి. ఈ కుకీస్‌ను బేకింగ్ ట్రేపై ఒకదానికొకటి కొంచెం దూరంగా అమర్చాలి. వీటిని ఓవెన్ లో 15-20 నిమిషాల పాటు లేదా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు బేక్ చేయాలి. బేక్ అయిన తర్వాత కుకీస్‌ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి.
కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
పిండి గనుక చేతికి ఎక్కువగా అంటుకుపోతున్నట్లు అనిపిస్తే, మరో 5-10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కుకీస్ కరకరలాడుతూ (క్రిస్పీగా) ఉండాలంటే అవి పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో సర్దాలి. ఒకవేళ వీటికి మరింత రుచిని జోడించాలనుకుంటే.. పిండి కలిపేటప్పుడే అందులో చిన్నగా కట్ చేసిన బాదం, జీడిపప్పు ముక్కలు లేదా చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?