Ragi Halwa Recipe: నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే టేస్టీ,హెల్తీ బెల్లం రాగి హల్వా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Halwa Recipe: పండగలకు, పబ్బాలకు నోరు తీపి చేసుకోవాలని ఉంటుంది. కానీ ప్రస్తుతం బయట దొరికే స్వీట్లు తినాలంటే భయమేస్తోంది. ఇంట్లోనే హెల్తీతోపాటు టేస్టీగా ఓ రెసిపీ చేద్దాం. సాధారణంగా గోధుమ హల్వా చేస్తాం. కానీ ఆరోగ్యంగా ఉండే మరో మంచి ఆప్షన్ రాగి హల్వా. రాగితో చేసే ఈ స్వీట్ తినడానికి జెల్లీలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ ప్రత్యేకమైన రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రాగి ఆరోగ్యానికి మంచిదే కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. సాంప్రదాయంగా రాగి హల్వా చేయాలంటే రాత్రంతా రాగి నానబెట్టి, దాని పాలు తీసి, పాకంలో కలిపి చాలాసేపు కలుపుతూ చేయాలి. కానీ అదే రుచి తక్కువ టైంలో రావాలంటే రాగిపిండితో చేసే ఈ సింపుల్ విధానం బాగా ఉపయోగపడుతుంది.
READ MORE: Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ఆ పోస్టు పేరు మార్పు
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
కావాల్సిన పదార్థాలు..
రాగిపిండి – పావు కప్పు
బెల్లం – పావు కప్పు
నీరు – మొత్తం సుమారు 2 కప్పులు
నెయ్యి – 1/8 కప్పు (కొద్దికొద్దిగా వేసుకోవాలి)
జీడిపప్పు – 5 (ముక్కలుగా)
తయారు చేసే విధానం..
ముందుగా రాగిపిండిలో కొద్దిగా నీరు వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఇంకా స్మూత్‌గా రావాలంటే మిక్సీలో ఒకసారి తిప్పి పలుచని బట్టలో వడకట్టి రాగిపాలు తీసుకోవాలి. ఇలా తీసిన పాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాత్రలో బెల్లం, కొద్దిగా నీరు వేసి మరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి మలినాలు తీసేయాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి జీడిపప్పు బంగారు రంగులో వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో రాగిపాలు పోసి తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇది నెమ్మదిగా చిక్కబడుతుంది. అప్పుడే బెల్లం పాకం వేసి మళ్లీ కలపాలి. కాస్త గట్టిపడే సమయంలో నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం నెయ్యి వేయకూడదు. కొంతసేపటికి హల్వా జెల్లీలా మెరుస్తుంది. ఇక నెయ్యి సైతం లోపలికి పీల్చుకోదు. చివరగా వేయించిన జీడిపప్పు వేసి కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. ఈ రాగి హల్వా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. పండుగ రోజుల్లో లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉన్నప్పుడు సింపుల్‌గా, తక్కువ సమయంలో చేసేయొచ్చు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!