Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!
- ఎండ అవసరం లేదు.. ఫ్యాన్ కిందే ఆరే సీక్రెట్ టెక్నిక్
- నానబెట్టకుండా సగ్గుబియ్యం పేస్ట్ తయారీ ఎలా?
- పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం కీలకమైన కుకింగ్ టిప్స్
- స్టోరేజ్ చిట్కాలు.. ఏడాది పొడవునా కరకరలాడే వడియాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadiyalu Recipe in Telugu : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. గృహిణులకు వడియాల సందడి మొదలవుతుంది. అయితే గంటల కొద్దీ మండుతున్న ఎండలో కూర్చుని వడియాలు పెట్టడం, వాటిపై దుమ్ము పడుతుందేమోనని ఆందోళన చెందడం వంటి ఇబ్బందులు ఇకపై అవసరం లేదు. ఎండతో పనిలేకుండా, కేవలం ఒక్కరోజులో ఫ్యాన్ కిందే ఆరిపోయే అద్భుతమైన ‘సగ్గుబియ్యం వడియాల’ (Sago Papad) సీక్రెట్ రెసిపీని తెలుసుకుందాం.. మొదటిసారి వడియాలు ట్రై చేసే వారు కూడా అస్సలు భయం లేకుండా చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా సగ్గుబియ్యం వడియాలు అంటే ముందురోజే నానబెట్టడం, గంటల కొద్దీ ఉడికించడం వంటి పెద్ద ప్రక్రియ ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో సగ్గుబియ్యాన్ని నానబెట్టాల్సిన పని లేదు. ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకుని మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా (ఉప్పు టెక్చర్‌లో) గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పొడిలో మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి, అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.
Also Read
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
BMW F 450 GS: భారత్ లో కొత్త BMW F 450 GS విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు & ధరలు
మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి కనీసం 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమం తెల్లగా కాకుండా ట్రాన్స్‌పరెంట్‌గా (గాజులా) మారే వరకు ఉడికించడం చాలా ముఖ్యం. అప్పుడే వడియాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండి ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు (రెండు టీస్పూన్లు) , జీలకర్ర లేదా వాము వేసి బాగా కలపాలి. వడియాల్లో ఉప్పు ఎప్పుడూ తక్కువగానే ఉండాలి, ఎందుకంటే అవి ఎండిన తర్వాత ఉప్పు శాతం పెరుగుతుంది.
వడియాలు పెట్టడానికి ఎండలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఒక కాటన్ క్లాత్‌ను తడిపి, గట్టిగా పిండి నేల మీద పరచాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే గరిటతో చిన్న చిన్న వడియాలలా క్లాత్ మీద స్ప్రెడ్ చేయాలి. రాత్రంతా ఫ్యాన్ కింద వదిలేస్తే మరుసటి రోజు ఉదయానికి ఇవి చక్కగా ఆరిపోతాయి. క్లాత్ వెనుక కొంచెం నీళ్లు చిలకరించి వడియాలను వేరు చేసి, కేవలం ఒక రెండు గంటల పాటు బాల్కనీ ఎండలో లేదా ఫ్యాన్ కిందే ఉంచితే పూర్తిగా డ్రై అయిపోతాయి.
వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో భద్రపరిస్తే ఏడాది పొడవునా పురుగు పట్టకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. బాగా కాగుతున్న నూనెలో ఈ వడియాలను వేయించితే తెల్లగా, పూవుల్లా విచ్చుకుంటూ నోట్లో వేస్తే కరిగిపోయేలా కరకరలాడుతుంటాయి. పని భారమే అనిపించకుండా, ఎంతో ఈజీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం వడియాలను మీరు కూడా తప్పక ప్రయత్నించండి..
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?