Site icon NTV Telugu

Carissa Fruit Benefits : వామ్మో.. వాక్కాయలతో ఇన్ని ఉపయోగాల..

Untitled 2

Untitled 2

Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏంటో ఎప్పుడు చూదాం.

Read also:

ఈ చెట్టుని ప్రాంతాన్ని బట్టి కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు, వాక్కాయలు అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ కాయలు వాన కాలంలో కాస్తాయి అంటే మే నుండి జూన్ వరకు విరివిగా లభిస్తాయి. ఇవి అడవుల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ప్రస్తుతం రైతులు వాక్కాయలను పంటగా కూడా పండిస్తున్నారు . ఈ కాయలు పచ్చివిగా ఉన్నపుడు పచ్చగాను ముదిరేకొద్దీ ముదురు ఎరుపు రంగులోను పూర్తిగా పండినతర్వాత నలుపు రంగులో ఉంటాయి. ఇవి రుచికి పచ్చిగా ఉన్నప్పుడు పులుపు వగరుగా ఉంటాయి. పండిన తర్వాత తియ్యగా ఉంటాయి.

Read also:health tips : గ్యాస్ ట్రబుల్ కి కారణాలు.. నివారణ చర్యలు

ఈ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల వ్యాధ్యుల బారిన పడకుండా ఉంటారు. అలానే చిగుర్లు ఆరోగ్యంగా ఉండి దంత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాక్కాయలు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. వాక్కాయ పండ్ల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు తగ్గి గుండె, మెద‌డు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version