Gastric Problems: హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటె కావాల్సిన వన్న సంపాదించుకోగలం. అందుకే మన పెద్దలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో వెల్త్ ఈజ్ హెల్త్ అనేలా ఉరుకులు పరుగులు. తినడానికి టైం లేదు నిద్రపోవడానికి పని వదలదు. పని ముగిసిన మొబైల్ ఫోన్ నిద్రపోనివ్వదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు లక్షల్లో సంపాదన ఉన్న నచ్చింది తింటూ జీవితాన్ని హాయిగా గడిపే అదృష్టం కొందరికి ఉండట్లేదు. దీనికి కారణం అనేక ఆరోగ్య సమస్యలు. అందులో ప్రస్తుతం వయసముతో సంబంధం లేకుండా చాలా మందిని బాధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? నివారణ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Devara : దేవర కోసం సరికొత్తగా ప్లాన్ చేస్తున్న కొరటాల…
సాధారణంగా మనం తీసుకున్న ఆహరం ప్రేగుల్లోకి వెళ్ళాక అక్కడ విచ్చిన్నం చేయబడుతుంది. అనంతరం విచ్చిన్నం అయిన ఆహారం రక్తంలోకి గ్రహించ బడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే పని. అయితే కొందరిలో తిన్న ఆహరం విచ్చినం కాదు అంటే జీర్ణం కాదు. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకలి కాదు కడుపు నొప్పిగా ఉంటుంది. అలానే మనకి ఆకలిగ అనిపించడానికి కారణం మన కడుపులో విడుదలయ్యే HCL అనే హార్మోన్. అయితే ఇది విడుదల అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విడుదల అవుతుంది. దాని వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. ఆకలి అని తినాలి అనుకుంటే తినలేం. దీన్నే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు.
Read also:Parineeti Chopra-Raghav Chadha: పెళ్లి తర్వాత.. పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా మొదటి ఫోటో!
గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి కారణాలు:
ఒకే చోట ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, టీ మరియు కాఫీ ఎక్కువగా తాగడం, సమయానికి తినకపోవడం, మసాలా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, అలసట, నిద్రలేమి, మానసిక ఆందోళనలు మొదలైన కారణాలవల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంభవిస్తుంది.
నివారణ చర్యలు:
ప్రతి రోజు ఒకే సమయానికి తినాలి.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళు గ్యాప్ తీసుకుంటూ కొంచం కొంచం తినాలి.
తినే ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.
మసాలా ఎక్కువ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి.
ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైలు ఎక్కువగా తినకూడదు.
మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి.
Read also:Canada: భారత్‌తో సంబంధాలపై కెనడా రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
వ్యాయామం మరియు ధ్యానం చెయ్యాలి.
బీన్సు, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్ వంటి వాటిని మోతాదు మించి తీసుకోకూడదు.
కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంటిని ఒకే క్వాంటిటీ లో తీసుకొని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అన్నింటిని కలిపి తగినంత ఉప్పువేసి ఒక సీసాలో వేసి భద్రపరుచుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగడం వల్ల అలసట, అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతి రోజు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పులో అద్దుకొని తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజు అల్లం ఉప్పు తినడం కష్టం అనుకునేవాళ్లు అల్లం,ఉప్పుని కలిపి ఉడకబెట్టి ఆ ఉడికిన అల్లాన్ని ఎండబెట్టుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న అల్లాన్ని రోజు రెండు మూడు ముక్కలు తింటే సరిపోతుంది
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.