Ragi Java Recipe: బ్రేక్‌ఫాస్ట్ తయారీకి సమయం లేదా? శక్తినిచ్చే రాగి జావ 10 నిమిషాల్లో రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Java Recipe: ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం. ఆఫీస్, కెరీర్ లక్ష్యాలు, బిజినెస్ పేరిట ఉదయం లేచినప్పటి నుంచి పరుగులు పెడుతునే ఉంటారు. ఈ హడావుడిలో ఆనందం, ప్రశాంతత తగ్గిపోతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకుండా పోయింది. కొందరైతే రోజూ మార్నింగ్ టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారు. లేదా రోడ్డు మీద దొరికే నాణ్యత లేని అల్పహారం చేస్తున్నారు. దీనికి కారణం టిఫిన్ తయారు చేయడానికి సమయం లేకపోవడం. ఈ సమస్యలకు ఇప్పుడు చెక్ పెడదాం. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం తొందరగా తయారయ్యి.. ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారంలో రాగి జావ మంచి ఎంపికగా చెప్పవచ్చు. మన దగ్గర సాధారణంగా రాగి అని పిలిచే ఈ ధాన్యం చిన్నదిగా కనిపించినా, ఇందులో పోషకాలు మాత్రం గట్టిగానే ఉంటాయి. రాగిని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. గ్లూటెన్ ఉండదు కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇది సురక్షితమైన ఆహారం. అందుకే ఇప్పుడు చాలామంది రాగిని ‘సూపర్ ఫుడ్’గా గుర్తిస్తున్నారు.
READ MORE: YS Jagan: నేడు జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలతో హైటెన్షన్
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
సాధారణంగా రాగి జావ కోసం రాగిని నీటిలో నానబెట్టి, మొలకెత్తించి, ఆరబెట్టి పొడిగా తయారు చేస్తారు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో దొరికే సాధారణ రాగి పిండితో కూడా చాలా సులువుగా, ఆరోగ్యకరంగా జావ చేయవచ్చు. ఇంట్లో తయారు చేసినదానికి, బయట దొరికే పిండికి పెద్ద తేడా ఉండదు. రాగి జావను రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఉప్పుగా, ఇంకొకటి తీపిగా. ఇందులో తీపి రాగి జావ చాలామందికి ఇష్టమైన అల్పాహారంగా చెబుతారు. ఈ తీపి రాగి జావ చూడటానికి పుడ్డింగ్‌లా ఉంటుంది. గట్టిగా ఉన్నా, నోట్లోకి వెళ్లగానే మృదువుగా అనిపిస్తుంది. తేలికపాటి తీపి రుచి ఉండటం వల్ల ఉదయాన్నే తినడానికి బాగుంటుంది. కొద్దిగా తరిగిన బాదం పప్పు వేసుకుంటే జావకు క్రంచీ టచ్ కూడా వస్తుంది. ఈ రెసిపీ కేవలం ఐదు పదార్థాలతో 10 నుంచి 15 నిమిషాల్లోనే తయారవుతుంది.
రాగి జావకు కావలసిన పదార్థాలు
రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు
నీరు – 1 కప్పు
పాలు – 1 కప్పు
బెల్లం – 1 టేబుల్ స్పూన్
తరిగిన బాదం పప్పు – కొద్దిగా
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో నీరు పోసి బాగా కలపాలి. ముద్దలు లేకుండా విస్క్‌తో లేదా చెంచాతో బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని స్టావ్ మీద పెట్టి ఉడికించాలి. ఎక్కువ మంట పెట్టి కలుపుతూ ఉండాలి. తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం కరిగే కొద్దీ మిశ్రమం రంగు మారుతుంది. కాస్త మెరుస్తూ కనిపిస్తుంది. మిశ్రమం చిక్కబడటం మొదలైన తర్వాత మంటను కొంచెం తగ్గించాలి. ఇప్పుడు మెల్లగా పాలను పోస్తూ కలపాలి. పాలు వేసిన తర్వాత ఆపకుండా కలుపుతూ ఉండాలి. అలా చేస్తే ముద్దలుగా ఏర్పడదు. కొద్దిసేపటికి పాలు మరిగి, మాల్ట్ మరింత గట్టిగా మారుతుంది. ఈ సమయంలో తరిగిన బాదం పప్పు వేయాలి. కావాలంటే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. రెండు నిమిషాలు మరిగిన తర్వాత మంట ఆపేయాలి. ఇప్పుడు రాగి జావను మరో గిన్నెలోకి తీసుకుని మెల్లగా కలిపితే సిద్ధం. వేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా రుచిగా ఉంటుంది. చల్లారితే ఇది ఇంకా చిక్కగా మారుతుందని గుర్తుంచుకోండి.
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!