ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్‌ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. అంతే కాకుండా.. ప్రస్తుతం నకిలీ ప్రోటీన్ పౌడర్లు మర్కెట్లోకి వచ్చాయి. వాటిని కొని యువకులు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని టిప్స్ ద్వారా వాటిని గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
READ MORE: Instagram Love: కొంపముంచిన ఇన్‌స్టా లవ్.. మైనర్ బాలుడితో 10 ఏళ్ల బాలిక పరార్..
ఈ టిప్స్ పాటించండి..
ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్‌ను జాగ్రత్తలు పాటించండి. నకిలీ ప్రొటీన్ పౌడర్‌లు అసలైన ఉత్పత్తులతో పోలిస్తే ఆకృతి, రంగులో అసమానతలు కలిగి ఉండవచ్చు. పౌడర్‌లో ఏదైనా గడ్డలు, రంగు మారడంలాంటివి ఉంటే చూడండి. వాటిని కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజీపై స్పెల్లింగ్ మిస్టెక్స్, ప్యాకేజింగ్ డిజైన్, లేబుల్ సమాచారం కచ్చితంగా చూడాలి. పొడి వాసనపై శ్రద్ధ వహించండి. కొన్ని ప్రొటీన్ సప్లిమెంట్లు ప్రత్యేకమైన వాసన కలిగి ఉండగా.. మరికొన్ని అధ్వానంగా ఉంటాయి. అసహ్యకరమైన వాసన కలుషితాన్ని సూచిస్తుంది. పౌడర్ చెడిపోయిందని సూచిస్తుంది. కొందరు బ్రాండెడ్ కంపెనీలకు డుప్లికేట్ చేస్తారు. మంచి ఉత్పత్తులు సాధారణంగా ప్రొఫెషనల్ ప్యాకేజింగ్, కచ్చితమైన లేబులింగ్ కలిగి ఉంటాయి. తయారీదారు పేరు, చిరునామా, సంప్రదింపు సమాచారం కోసం లేబుల్‌ని తనిఖీ చేయండి.
READ MORE: Mumbai: ముంబైలో దారుణం.. పాఠశాల గదిలో బాలికపై టీచర్ అత్యాచారం
అసలైన ఉత్పత్తులు సప్లిమెంట్ వెనుక ఉన్న కంపెనీ గురించి స్పష్టమైన వివరాలను అందిస్తాయి. ప్యాకేజింగ్‌పై ఈ సర్టిఫికేషన్ బాడీల సీల్స్ లేదా లోగోలు చూడండి. అయితే నకిలీ బ్రాండ్‌లు కొన్నిసార్లు ఈ లేబుల్‌లను కాపీ చేయవచ్చని గుర్తుంచుకోండి. వీలైతే కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికేట్ ప్రామాణికతను కన్ఫామ్ చేసుకోండి. ముఖ్యంగా ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, అనధికారిక వెబ్‌సైట్‌ల నుండి ప్రొటీన్ పౌడర్‌ను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఉండటానికి పంపిణీదారుల నుండి కొనుగోలు చేయండి.