Alcohol With Drinks: మందులో ఆ డ్రింక్ మిక్స్ చేసుకొని తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alcohol With Drinks : జోష్ పెంచుతుందనుకున్న డ్రింక్… గుండెకు ముప్పు తెస్తే? పార్టీలు, వేడుకలు, స్నేహితుల సమావేశాల్లో మద్యం గ్లాస్లో ఎనర్జీ డ్రింక్ కలపడం ఇప్పుడు చాలా మందికి సాధారణ అలవాటుగా మారింది. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. రాత్రంతా ఉత్సాహంగా ఉండటానికి, అలసట లేకుండా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన మార్గమని చాలామంది భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ దీన వెనుక ఉన్న ప్రమాదాలను హెచ్చరిస్తున్నారు. కాసేపు ఉత్సాహం ఇచ్చే ఈ మిశ్రమం గుండెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారి తీసే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
సాధారణంగా ఆల్కహాల్,ఎనర్జీ డ్రింక్స్ శరీరంపై పూర్తిగా విరుద్ధ ప్రభావాలు చూపిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తూ వ్యక్తిని చురుకుగా, అప్రమత్తంగా ఉంచుతాయి. మరోవైపు ఆల్కహాల్ మెదడు కార్యకలాపాలను మందగింపజేస్తూ నిద్రమత్తు, అలసటను కలిగిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలోకి వెళ్లినప్పుడు ప్రమాదకరమైన భ్రమను సృష్టిస్తాయి. తాను ఇంకా పూర్తిగా అప్రమత్తంగానే ఉన్నాననే భావనతో మద్యం తీసుకున్న వ్యక్తి మరింత ఎక్కువ మద్యం తాగే అవకాశం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఆల్కహాల్ స్థాయి పెరిగిపోతున్నా అది వెంటనే గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Jelly Bangles Designs: ఇప్పుడు ఈ గాజులే ట్రెండ్.. కుర్తీ, జీన్స్, చీర.. ప్రతి డ్రెస్‌కు సరిపోయే డిజైన్లు.. ఇలా ట్రై చేయండి..
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
మణిపాల్ హాస్పిటల్ వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ హరణహళ్లి ప్రకారం, మద్యం, ఎనర్జీ డ్రింక్స్ రెండూ విడివిడిగా కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. అయితే వాటిని కలిపి తీసుకున్నప్పుడు ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరగడం, శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం, డీహైడ్రేషన్ రావడం, గుండె స్పందనలో అసాధారణ మార్పులు కనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వైద్యులు దీనిని హాలిడే హార్ట్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. ఇంతకు ముందు గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకపోయినా అధిక మద్యపానం వల్ల గుండె స్పందనలో అవకతవకలు ఏర్పడే పరిస్థితిని ఈ పేరుతో పిలుస్తారు. గుండె దడ, తలతిరగడం, ఛాతిలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇక ఎనర్జీ డ్రింక్స్ విషయంలో కూడా ప్రమాదాలు తక్కువ కావు. వీటిలో సాధారణంగా అధిక మోతాదులో కెఫీన్, టౌరిన్, చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. కెఫీన్ గుండె వేగాన్ని పెంచి రక్తపోటును అధికం చేస్తుంది. టౌరిన్ వంటి పదార్థాలు గుండె పనితీరుపై అదనపు ప్రభావం చూపుతాయి. అధిక చక్కెరల వల్ల స్థూలకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, గుండెపై అధిక ఒత్తిడి, అసాధారణ గుండె స్పందనలు ఏర్పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకర అరిథ్మియాలు నమోదయ్యాయి.
అట్రియల్ ఫైబ్రిలేషన్, సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా, వెంట్రిక్యులర్ టాకీకార్డియా వంటి గుండె స్పందనలో తీవ్రమైన మార్పులు ఎనర్జీ డ్రింక్స్ అధిక వినియోగంతో సంబంధం ఉన్న పరిస్థితులుగా గుర్తించబడ్డాయి. రక్తపోటు పెరగడం, గుండె వేగం అధికమవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో అత్యవసర వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు.
అయితే అసలు ప్రమాదం ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు మొదలవుతుంది. సాధారణంగా మద్యం ఎక్కువైతే నిద్రమత్తు, అలసట వంటి సంకేతాల ద్వారా శరీరం హెచ్చరిస్తుంది. కానీ ఎనర్జీ డ్రింక్స్ ఆ సంకేతాలను కప్పిపుచ్చేస్తాయి. బయటకు చూస్తే వ్యక్తి చురుకుగానే ఉన్నట్లు కనిపించినా రక్తంలో ఆల్కహాల్ స్థాయి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. దీంతో మద్యం విషప్రభావం, డీహైడ్రేషన్, ప్రమాదాలు, తప్పు నిర్ణయాలు తీసుకోవడం, గుండె సంబంధిత సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
గుండె విద్యుత్ వ్యవస్థపై ఆల్కహాల్ ఒక రకంగా ప్రభావం చూపితే, ఎనర్జీ డ్రింక్స్ గుండె కార్యకలాపాలను మరో రకంగా వేగవంతం చేస్తాయి. ఈ రెండు ప్రభావాలు కలిసినప్పుడు గుండె స్పందనలో తీవ్రమైన అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వెంట్రిక్యులర్ టాకీకార్డియా వంటి పరిస్థితుల్లో గుండె అసాధారణ వేగంతో కొట్టుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రక్తాన్ని సమర్థంగా పంపలేకపోతుంది. చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అలాగే అట్రియల్ ఫైబ్రిలేషన్ వల్ల రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అరుదైన సందర్భాల్లో ఆకస్మిక గుండె ఆగిపోవడం కూడా సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు, కుటుంబంలో గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రమాదం కేవలం వారికే పరిమితం కాదని, ఆరోగ్యంగా ఉన్న యువత కూడా ఈ మిశ్రమం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అందుకే మద్యం, ఎనర్జీ డ్రింక్స్‌ను కలిపి తీసుకోవద్దని కార్డియాలజిస్టులు బలంగా సూచిస్తున్నారు. మద్యం పరిమితంగా తీసుకోవడం, కెఫీన్ అధికంగా ఉండే పానీయాలను నియంత్రించడం, తగినంత నీరు తాగడం, గుండె దడ, ఛాతినొప్పి, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. సరదా కోసం తీసుకున్న ఒక గ్లాస్ డ్రింక్, గుండె ఆరోగ్యానికి ఊహించని ముప్పుగా మారకూడదంటే అవగాహన, జాగ్రత్తలు రెండూ అవసరమే.
- Tags
- alcohol
- Health News
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!