Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
- వర్షాకాలం పూల మొక్కలు పెంచేందుకు అనుకూలమైన సీజన్..
- మొక్కలు నాటితే మంచి ఎదుగుదల ఉండే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flower Plants: వర్షాకాలం అంటే కేవలం వేడి వేడి వంటకాలు, పానీయాలను ఆస్వాదించే సమయం మాత్రమే కాదు.. గార్డెనింగ్‌కు కూడా ఎంతో అనుకూలమైన సీజన్. ముఖ్యంగా ఆగస్టు నెలలో వాతావరణంలో తేమ ఉండటంతో మొక్కలు వేగంగా ఎదగడానికి మంచి పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాలు మొదలవగానే చెట్లు, మొక్కల్లో కొత్త చిగుళ్లు రావడం, పచ్చదనం పెరగడం కనిపిస్తుంది. దీంతో ఇంటి బాల్కనీ లేదా గార్డెన్‌ను పూలతో అందంగా అలంకరించుకొనేందుకు మంచి సమయం.
ఈ సీజన్లో మట్టిలో సహజంగానే తేమ ఉంటుంది. కాబట్టి కొన్ని పూల మొక్కలను పులా కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. అయితే వర్షాకాలంలో మొక్కలకు తరచూ నీరు పోయడం కంటే కుండీలలో నీరు నిల్వ కాకుండా చూడటం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా నిలిచిపోతే మొక్కల వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. సరైన కుండీ, మట్టి, డ్రైనేజీ, వెలుతురు వంటి అంశాలపై శ్రద్ధ పెడితే మీ ఇంటి బాల్కనీ లేదా గార్డెన్ మరింత అందంగా కనిపిస్తుంది. మరి ఎలాంటి పులా మొక్కలు నాటితే మంచిదంటే..
Also Read
- Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
- Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
- Women's Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
- Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
చామంతి:
సాధారణంగా చలికాలంలో పూసే పూలకు చామంతి ప్రసిద్ధి. అయితే వర్షాకాలంలో ఈ మొక్క ఎదుగుదలను ప్రారంభించడానికి మంచి సమయం. ఆగస్టులో నాటిన చామంతి మొక్క క్రమంగా బలంగా పెరిగి చలికాలం వచ్చే సమయానికి పూలు పూయడానికి సిద్ధమవుతుంది. ఈ మొక్కను ఎప్పుడూ నీరు నిలిచిపోయే మట్టిలో ఉంచకూడదు. కుండీలో నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. మొక్కను మరింత దట్టంగా పెంచేందుకు పై భాగంలోని చిగుళ్లను అప్పుడప్పుడు స్వల్పంగా కత్తిరించాలి కూడా. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ, వర్షాల సమయంలో ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అనేది గమనిస్తూ ఉండాలి.
మందారం:
ఎరుపు, పసుపు, గులాబీ వంటి అనేక రంగుల్లో లభించే ఈ మందారం మొక్క ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. వర్షాకాలంలో మందారంలో కొత్త కొమ్మల ఎదుగుదల బాగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమయంలో కట్టింగ్ లేదా చిన్న మొక్కను నాటుకోవచ్చు. మందారానికి నీరు నిల్వ ఉండని మట్టి అనుకూలంగా ఉంటుంది. మట్టిలో ఇసుకతో పాటు బాగా తయారైన సేంద్రియ ఎరువును కలిపితే మట్టి గుల్లగా మారి నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఉంటుంది. భారీ వర్షాలు కురిసే సమయంలో గమలాన్ని నీరు ఎక్కువగా నిలిచిపోని, తగినంత వెలుతురు లభించే ప్రదేశంలో ఉంచడం మంచిది.
బంతిపూలు:
తక్కువ సమయంలోనే గార్డెన్‌ను రంగురంగుల పూలతో నింపాలనుకునేవారికి బంతిపూల మొక్క మంచి ఎంపిక. వర్షాకాలంలో మట్టిలో ఉండే తేమ మొక్క ప్రారంభ ఎదుగుదలకు సహాయపడుతుంది. తగినంత వెలుతురు లభిస్తే బంతి మొక్క వేగంగా పెరిగి తరువాత పూలను ఇస్తుంది. బంతి మొక్కను వర్షం తర్వాత ఎండ లేదా తగినంత వెలుతురు లభించే ప్రదేశంలో ఉంచాలి. గమలంలో నీరు నిలిచిపోకుండా జాగ్రత్త వహించాలి. మొక్కపై ఎండిపోయిన ఆకులు లేదా పూలు కనిపిస్తే వాటిని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. ఇలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.
బోగన్విలియా:
బాల్కనీ, టెర్రస్ లేదా గార్డెన్లో కొంత ఎక్కువ స్థలం ఉన్నవారు బోగన్విలియా మొక్కను పెంచుకోవచ్చు. వివిధ రంగుల్లో కనిపించే దీని పుష్పాలు, ఆకులు ఇంటి పరిసరాలను ఆకర్షణీయంగా మారుస్తాయి. వర్షాకాలంలో బోగన్విలియా నాటేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. నీరు నిల్వ కాకుండా చూడటం. ఈ మొక్కకు ఎక్కువ తేమ ఉన్న మట్టి అంతగా అనుకూలం కాదు. మంచి ఎదుగుదలకు సూర్యరశ్మి అవసరం. వర్షాలు తగ్గిన తర్వాత మొక్కకు తగినంత వెలుతురు లభించేలా చూడాలి. అవసరాన్ని బట్టి కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే మొక్క ఆకారం చక్కగా ఉండటంతో పాటు కొత్త ఎదుగుదలకు కూడా అవకాశం ఉంటుంది.
సదాబహార్:
ఎక్కువ శ్రద్ధ తీసుకోకుండా సులభంగా పెంచుకోగల పూల మొక్క కోసం చూస్తున్నట్లయితే సదాబహార్ మంచి ఎంపిక. వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. సరైన సంరక్షణ అందిస్తే ఎక్కువ కాలం పూలను అందిస్తుంది. సదాబహార్‌ను నాటే కుండీకి కింద తప్పనిసరిగా డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. వర్షాకాలంలో సాధారణంగా అదనంగా నీరు పోయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అయితే మట్టి ఎప్పుడూ నీటిలో తడిసి ఉండకుండా చూసుకోవాలి. ఎండిపోయిన, బలహీనమైన కొమ్మలను తొలగిస్తూ ఉంటే మొక్క మరింత శుభ్రంగా, దట్టంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?