కాలం ఏదైనప్పటికి జ్యూస్ లు మాత్రం తప్పకుండా తాగాలి. జ్యూస్ తాగడం వల్ల పోషకాలు లభిస్తాయి. అయితే, ఎక్కువ చక్కెర ఉన్న జ్యూస్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. కానీ అటువంటి పరిస్థితిలో, ఏ పండ్ల రసం తాగాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యూస్ అని తాగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏ జ్యూస్ తాగితే దేనికి ఉపయోగం అనే విషయాని తెలుసుకుందాం..
1. గాఢ నిద్ర
ఈ మధ్య కాలంలో నిద్రలేమి తనంతో చాలా మంది బాధపడుతున్నారు. సుఖనిద్ర కోసం మందులు వాడటమొ లేక మందుతాగాటమొ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న మెంటల్ టెన్షన్ తో చాలా మంది అదే చేస్తున్నారు .కానీ ఈ నాలుగు రకాల జ్యూస్ లలో మీకు తోచింది ఏదైతే అది తాగి చూడండి కచ్చితంగా మంది నిద్ర పడుతుంది. ఇంతకి ఏంటా జ్యూస్‌లు అంటే.. పుదీనా ఆకులు, కొబ్బరి నీరు, నిమ్మరసం. పడుకునే ముందు నిమ్మకాయ నీరు తాగడం వల్ల విశ్రాంతి లభిస్తుంది, నిద్రకు సహాయపడుతుంది. ఇది హైడ్రేషన్‌కు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరంలో అనేక విధులకు ముఖ్యమైనది. భుజాల నుంచి ఒత్తిడి తగ్గిస్తుంది,చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. కొబ్బరి నీరు కూడా మెండ్‌ని రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. పడుకునే ముందు తాగితే మంచిది. అలాగే పుదీనా జ్యూస్ తాగడం వలన మలబద్ధకం కూడా తగ్గుతుంది.
2. పేగు ఆరోగ్యాన్నికి
మనం రోజూ తీసుకునే ఆహారాన్ని బట్టి పేగు ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. మసాలాలు, పుల్లని పదార్థాలు, కారం వంటివి అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే మాత్రం పేగు ఆరోగ్యం ఇబ్బందుల్లో పడినట్టే ఉంటుంది. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తో పాటు, పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీని కోసం తీసుకోవలసిన మంచి ఆహారం తో పాటు కొన్ని జ్యూస్ లు కూడా తీసుకోవాలి. ఇంతకీ ఏంటా జ్యూస్ లు అంటే బొప్పాయి,ఆపిల్,ప్రూనే,చియా విత్తనాలు. ఇందులో ముందు బొప్పాయి జ్యూస్ లో విటమిన్ సి, విటమిన్ ఎ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.యాపిల్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలు దొరుకుతాయి. పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్ ప్రూనే.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
3. తలనొప్పి ఉపశమనం
కాల్షియం,మెగ్నీషియం, B విటమిన్ ఉన్న జ్యూస్‌లు తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపగతాయి. మరి మైగ్రేన్ తగ్గించే ఈ విటమిన్ లు కలిగిన జ్యూస్ లెంటి అంటే పుచ్చకాయ, బచ్చలి కూర,పుదీనా ఆకు,నిమ్మరసం. ఈ నాలుగు జ్యూస్‌లు మైగ్రేన్ తగ్గించడానికి చాలా ఉపయెగ పడతియి. ఇది తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ హాని ఆడ్ చేసుకుని తాగితే సరిపోతుంది. ట్యాబ్‌లెట్స్ పైన ఆదార పడటంకంటే ఇలాంటి జ్యూస్ లు తాగటం ఉత్తమం.
4. సైనస్ నివారణ
సైనస్ ఉన్నవారు నిత్యం నరకం చూస్తుంటారు. వాతావరణం మారిందంటే చాలు.. ముక్కులు పట్టేస్తాయి. ఊపిరి పీల్చడం ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో తీవ్రమైన తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే.. ఈ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆయుర్వేదం అంటే కొంచెం కష్టం కానీ ఈ నాలుగు రకాల జ్యూస్ లు కనుక తాగితే సైనస్ ని ఈజీగా నివారించవచ్చు. అవును క్యారెట్,గ్రీన్ ఆపిల్,నారింజ,అల్లం. ఈ నాలుగు పదార్థలను వీలైనంత వరకు తీసుకుంటే మంచిది. అల్లం జ్యూస్ కూడా ఉంటదా అంటే వాటర్ అల్లం ముక్కలు ఒకటి రెండు వేసి మిక్స్ చేసుకుని తాగితే సరిపోతుంది.
5. క్లియర్ స్కిన్..
చర్మం ఆరోగ్యంగా, కోమలంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మచ్చలు, మొటిమలు చర్మం నిర్జీవంగా మారి అందవిహీనంగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నారింజ,క్యారెట్,పసుపు,మిరియాలు జ్యూస్ తాగండి. క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్‌తో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. కనుక రోజూ క్యారెట్ జ్యూస్ తప్పకుండా తాగండి.పసుపు కలిపిన పాలు తాగితే కూడా అందం రెట్టింపు అవుతుంది.మిరియాల జ్యూస్ కూడా మంచిది. అందులో కొంచెం బెల్లం కాని హని కానీ యాడ్ చేసుకుని తాగండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దోహదపడతాయి.