Health Tips: నూడుల్స్ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు వీటిలో అధికంగా ఉండవు, కాబట్టి ఇవి ఆరోగ్యానికి చేసే మేలు చాలా తక్కువ. నూడుల్స్ తరచుగా తినడం వల్ల శరీరంపై చాలా దుష్ప్రభావాలు పడతాయి. మీరు కూడా ప్రతి వారం నూడుల్స్ తినే వారైతే ఓసారి ఈ మార్పులు మీలో కలిగాయేమో లేదో చూసుకోండి.
1. అధిక బరువు: నూడుల్స్ ను తరచుగా తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు. తినడం అలవాటుగా మారుతే మాత్రం ఊబకాయం బారిన పడతారు. శరీరంలో సోడియం అధికంగా చేరడం, శరీరంలో నీరు నిలిచిపోవడం వంటివి జరుగుతాయి.
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
2. లైంగిక జీవితం: నూడుల్స్ అధికంగా తింటే ప్రతికూల పరిణామాలు పురుషుల్లో వెంటనే కనిపిస్తాయి. వీరిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. నూడుల్స్ లో ఉండే సింథటిక్ పదార్థాలు సెక్స్ హార్మోన్లను డిస్ట్రర్బ్ చేస్తాయి. దీని వల్ల లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది.
3.మెటబాలిక్ సిండ్రోమ్: నూడుల్స్ అధికంగా తినే మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ వస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ప్రతి వారం నూడుల్స్ తినే వారిలో ఆరోగ్యానికి కచ్చితంగా భంగం కలుగుతుంది.
4. పోషకాలు నాశనం: నూడుల్స్ వంటి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాలు అందక నీరసంగా మారిపోతారు. అలసట పెరిగిపోతుంది. ఇతర ఆరోగ్యకరమైన ఆహారాల్లోని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరం గ్రహించుకోవాలంటే నూడుల్స్ తినడం మానేయాలి.
5. మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు నూడుల్స్ ను వెంటనే దూరం పెట్టాలి. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి ఉన్నవారు తింటే వారి ఆరోగ్యం మరింత దిగజారుతుంది.
చూశారు కదా జర ఇకనుండైనా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ పక్కన పెట్టి శుభ్రంగా ఇంట్లో అమ్మ చేసింది తిందాము.. లేకుంటే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడితే ఫాస్టుగానే పోతాము.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!