ఆలూ తో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు.. స్నాక్స్, కర్రీలను, ఫ్రై లను చేస్తుంటారు.. వీటిని ఎన్నో విధాలుగా వాడుతారు.. చాలా రుచిగా ఉండటంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. వీటితో చేసే వంటలలో ఆలు ఫ్రై కూడా ఒకటి.. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందరికి నచ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు – 3,
ధనియాలు – ఒక టీ స్పూన్,
జీలకర్ర – అర టీ స్పూన్,
మిరియాలు – అర టీ స్పూన్,
కారం – ఒక టీ స్పూన్,
నూనె – 2 టేబుల్ స్పూన్స్,
తరిగిన పచ్చిమిర్చి – 2,
ఎండుమిర్చి – 2,
ఇంగువ -కొద్దిగా,
తరిగిన ఉల్లిపాయ – 1,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,
ఉప్పు – తగినంత,
పసుపు – పావు టీ స్పూన్…
తయారీ విధానం :
ఆలూ ను ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. చెక్కును తీసుకొని కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి..తరువాత ఉప్పు వేసిన నీటిలో వేసి పక్కకు ఉంచాలి. ఆ తర్వాత కళాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని కొద్దిగా పెద్ద మంటపై కలుపుతూ వేయించాలి. ఈ ముక్కలన్నిటిని కలిపి క్రీస్పిగా వచ్చేవరకు వేయించాలి..ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరో కడాయిల్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పోవు పెట్టాలి.. తర్వాత ఇంగువ వేసి కలపాలి.. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి.. ఆ తర్వాత మసాలా పొడి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి..అంతే ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ అయినట్లే.. మీరు కూడా ట్రై చెయ్యండి..