నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం.. ఎక్కువ మంది చికెన్ ను తీసుకుంటారు.. అయితే ఎక్కువ మంది చికెన్ లెగ్స్, వింగ్స్ ను ఎక్కువగా తింటారు. కానీ చికెన్ లివర్ ను ఎక్కువగా తినడానికి ఇష్ట పడరు.. దాన్ని తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అఫోహలో ఉంటారు.. కానీ చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ లోని కాలేయాన్ని కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది మాత్రం అంత ఇష్టాన్ని చూపించరు. అయితే చికెన్ కాలేయంలో చాలా పోషకాలు ఉంటాయి.అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చికెన్ లివర్లో కొన్ని ముఖ్యమైన బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.. అందుకే వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
గర్భిణీలు తల్లులు పెరుగుతున్న పిల్లలు మరియు ప్రోమెటమాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. చికెన్ లివర్ డెంటల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే ఈ చికెన్ లివర్ ను తప్పక తీసుకోవాలి..
ఈ లివర్ లో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.. ఈ విటమిన్ రోగానిరోధకతను పెంచుతుంది.. కళ్ళు, చర్మం, జుట్టు మరియు గోళ్ళుఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది..
ఇకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉంది.. చికెన్ లివర్ ను బాగా ఉడికించి తీసుకోవడం మంచిది.. ఉడికించకపోతే ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎందుకంటే క్యాంపులో డాక్ట్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులోనే ఈ చికెన్ కాలయాన్ని తినాలి. ఎందుకంటే ఈ లివర్లోని విటమిన్ ఏ అధిక మోతాదు శిశువుకు హాని కలిగిస్తుంది.. చికెన్ లివర్ తీసుకోవడం మంచిదని అతిగా తినడం కూడా మంచిది కాదు.. గుర్తుంచుకోండి..