Baby Care Tip: పిల్లలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు తిన్నా తినకున్న నీరసంగా ఉంటారు.. వేసవి సెలవులు ముగిసాయి..ఇక స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.. రోజులు హ్యాపీగా గడిపేసిన పిల్లలు తిరిగి బడి బాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లడం అంటే చాలా మంది పిల్లలు పెద్దగా ఇష్టం చూపించరు.. అందుకే పిల్లలను శారీరకంగా మానసికంగా ఉంచడం చాలా ముఖ్యం..అన్ని వయసుల పిల్లలు కొన్ని పనులు చేసేలా వారిని ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా చేయాలి. వాటి వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా చురుకుగా తయారవుతారు.. పేరెంట్స్ ముఖ్యంగా చెయ్యాల్సిన పనులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. పిల్లల ఆరోగ్యానికి అవుట్ డోర్ ప్లే చాలా ముఖ్యం. ఆరుబయట శారీరక శ్రమలో పాల్గొనడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆటలు, సైకిల్ తొక్కడం, పార్కులో నడవడం వంటివి చేయాలని వారిని ప్రోత్సహించాలి…
*. పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు.. అందుకే చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు, పెద్ద వారి కోసం వారికి నచ్చిన పుస్తకాలను కలిసి చదువుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం, చివర్లో కథ గురించి అడగడం ద్వారా వారి పార్టిసిపేషన్ ను ప్రోత్సహించవచ్చు.
Also Read
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
*. డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ లు లేదా బ్లాక్‌లను నిర్మించడం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పిల్లను నిమగ్నం చేయాలి. ఇవి వారిలో సృజనాత్మక నైపుణ్యాలను పెంచుతాయి. చక్కటి మోటార్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఊహా శక్తిని మెరుగుపరుస్తుంది..
*. ఇంటి చుట్టుపక్కల వయస్సుకు తగిన పనులు, బాధ్యతల్లో పిల్లలను నిమగ్నం చేయాలి. ఇది వారికి ఆర్గనైజేషన్, టీమ్ వర్క్, జవాబుదారీతనం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్పుతుంది. గదిని చక్కబెట్టడం, టేబుల్‌ను అమర్చడం.. ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యడం చేయించాలి..
*. కుటుంబ సమేతంగా కలిసి తినడం మంచి అలవాటు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలోపేతం కావడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించవచ్చు. కనీసం రోజులో ఒక పూట కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.. అప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి వారికి పదే పదే చెప్పాలి.. ఇలాంటివి తరచూ చేస్తూ ఉంటే పిల్లలు చురుగ్గా తయారవుతారు..
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!