మనకు కావలసిన అన్ని ఫోషకాలను అందిస్తున్న పండ్లలో అంజీర ఒకటి.. దీన్ని పచ్చిగా తిన్నా, ఎండువి తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంజీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలకు చాలా అవసరం. ఎందుకంటే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది..
అంజీరాలోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే మెగ్నీషియం, డైటరీ ఫైబర్ రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
బరువు తగ్గాలనుకునే వారికి కూడా అంజీర్ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ కడుపును తొందరగా నింపుతుంది. అతి ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి..
ఈ పండ్లలో ఉండే మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి వంటి విటమిన్లు, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మన శరీరాన్ని సంక్రమణ నుంచి రక్షించడానికి, వ్యాధులను తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి..
అంజీరాలో ఎముకల నిర్మాణం, బలంగా ఉంచడానికి అవసరమయ్యే కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముక సాంద్రతను మెరుగుపరుస్తాయి..
వీటిని మధుమేహులు కూడా తినొచ్చు. దీనిలోని ఫైబర్ చక్కెరల శోషణ మందగించడానికి సహాయపడుతుంది.. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మెరుగు పడుతుంది.. ఇంకా ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. మార్కెట్ ఎండువి ఎప్పుడూ ఉంటాయి.. మీరు వీటిని డైట్ లో చేర్చుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.