లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక అరుదైన నివారణ లేని వ్యాధితో బాధపడుతున్నగర్భవతి గ్రామీణ వైద్య కేంద్రం నుండి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నకు మెరుగైన వైద్యం కొరకు పంపటం జరిగినది. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఆమెకు అన్ని పరీక్షులు నిర్వహించి, ఆమెకు ఉన్న ఫ్యాక్టర్ V అనే రక్త సంబంధిత వ్యాధి చాల అరుదైనదని , దీనివలన ప్రసవం సమయంలో అనేక క్లిష్ట సమస్యలు ఎదురవుతాయని ముందుగానే గుర్తించారు. ఈ రకమైన వ్యాధి లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు.
ఆమె ప్రసవపూర్వపు సంరక్షణ స్థానికి వైద్య కేంద్రంలో పొంది, రక్త పరీక్షలో తేలిన ఒక అసాధారణ రుగ్మత కారణంగా 39 వారాల గర్భంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నకు వచ్చింది. రెయిన్ బో వైద్యులు అది ఫ్యాక్టర్ V లోపం అని గుర్తించి, దానిని నివారించుట సాధ్యపడదు కనుక ప్రసవ సమయంలో ఎదురయ్యే తీవ్రపరిణామాల గురించి వివిధ విభాగాల సమన్వయంతో వైద్య బృందం పూర్తిగా ప్రసవం కోసం జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించటం జరిగినది. ఇలాటి ప్రసవాల సందర్భంలో ప్రాధమికంగా రక్తస్రావం అధికంగా జరుగుతుంది. దీనిని నివారించు పద్దతులు సరియైన సమయంలో అందుబాటులో లేకుంటే ఆ తల్లి మరణానికి కూడ దారితీయవచ్చు.
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ హిమబిందు అన్నమరాజు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, ఈ ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించి, దీని అధిగమించాలనే పట్టుదలతో ఒక క్లినికల్ హెమటాలజిస్ట్, ఒక ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ కన్సల్టెంట్, ప్రత్యేక అనస్థీషియాలజిస్ట్తో కూడిన బహుళ-విభాగాల బృందాన్ని ప్రసవానికి ముందు సిద్డంచేసుకున్నారు. రోగి కుటుంబ సభ్యులకు కూడ ప్రసవ సమయంలో అవసరమయ్యే రక్త ఉత్పత్తుల మార్పిడి గురించి వివరించారు. రక్తాన్ని గడ్డ కట్టించే రక్త ఉత్పత్తి అయిన క్రయోప్రెసిపిటేట్ కీలక పాత్ర పోషించింది. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం సమన్వయంతో శిశువు క్షేమంగా జన్మించింది, తల్లి ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ప్రసవానంతరం ఆమె రక్తం గడ్డకట్టే స్థితిని మరియు రక్త మార్పిడుల వలన ఆమె శరీర స్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షించారు.
ఈ సంక్లిష్టమైన ప్రసవాన్ని సురక్షితంగా నివహించిన సందర్భంగా డాక్టర్ హిమబిందు అన్నమరాజు, రెయిన్బో హాస్పిటల్స్ వారు మాట్లాడుతూ “గర్భధారణ సమయంలో ఫ్యాక్టర్ V లోపం చాలా అరుదని, దీనికి నిర్దిష్టమైన నియమావళి లేదని అన్నారు. ఈ స్థితిలో మనం చేయగలిగింది ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం, ప్రసవానికి ముందే సంబంధిత నిపుణులందరినీ మరియు అవసరమైన రక్త ఉత్పత్తులను సిద్ధంగా ఉంచుకోవడం,” చాల ముఖ్యం అన్నారు.
Dr. Himabindu Annamaraju
Consultant Obstetrician, Gynecologist & Laparoscopic Surgeon, Specialist in High Risk. BirthRight by Rainbow
- Tags
తాజావార్తలు
-
లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..