High Paying Jobs For Freshers: ఈ రోజుల్లో సమాజంలో అనేక అవస్థలు పడే వారిలో ముందు వరుసలో ఉండే వారు నిరుద్యోగులు. ఎందుకంటే అప్పటి వరకు నిరుద్యోగులు విద్యార్థులుగా ఉండి చదువుకునే వారు. కానీ ఒక దశ దాటిపోయిన తర్వాత వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి నుంచి మొదలు అవుతాయి అవస్థలు అనేవి. ఒక ఫ్రెషర్‌కు ప్రస్తుత మార్కెట్‌లో ఉద్యోగం దొరకడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. కానీ ఎలాంటి అనుభవం లేకుండా ఫ్రెషర్లకు లక్షల్లో జీతాలు ఇస్తున్న ఐదు ఉత్తమ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతకీ అవి ఎంటో మీకు తెలుసా..
READ ALSO: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం అసాధ్యం కాదు..
ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం అసాధ్యం కాదని అంటున్నారు. నిరుద్యోగులకు డిజిటల్ నైపుణ్యాలు, డేటా విశ్లేషణ, కస్టమర్-కేంద్రీకృత పరిష్కారాలు అవసరమయ్యే రంగాలలో ఉద్యోగాలు అనువైనవిగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కేవలం డిగ్రీలపై మాత్రమే కాకుండా, అదనపు సర్టిఫికేషన్లు, తదితర కోర్సులు చేసి మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా మనం చెప్పుకోబోతున్న ఉద్యోగాలు.. ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా, అద్భుతమైన ఉద్యోగ ప్రొఫైల్‌లను కూడా అందిస్తాయి.
ఫ్రెషర్లకు అత్యధిక జీతం ఇచ్చే 5 ఉద్యోగాలు..
1. డేటా అనలిస్ట్ / జూనియర్ డేటా సైంటిస్ట్
వివరాలు: వ్యాపార సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి, భవిష్యత్తు ధోరణులను అంచనా వేయడానికి పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించడం ఇందులో ముఖ్యమైనది.
ప్రారంభ జీతం (అంచనా): ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.
అవసరమైన నైపుణ్యాలు: పైథాన్/ఆర్ ప్రోగ్రామింగ్, SQL, గణాంకాల పరిజ్ఞానం, డేటా విజువలైజేషన్ సాధనాల ఉపయోగం వచ్చి ఉండాలి.
2. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ (SDE)
వివరణ: వివిధ ప్లాట్‌ఫారమ్‌ల (వెబ్, మొబైల్, క్లౌడ్) కోసం అప్లికేషన్‌లు, సిస్టమ్‌లను నిర్మించి నిర్వహించాలి.
ప్రారంభ జీతం (అంచనా): సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలు (అద్భుతమైన కోడింగ్ నైపుణ్యాలు కలిగిన IIT/NIT/టైర్-1 కళాశాల విద్యార్థులకు రూ. 25 లక్షల + జీతం).
అవసరమైన నైపుణ్యాలు: జావా, పైథాన్, C++, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథంస్ (DSA) లపై బలమైన కమాండ్ ఉండాలి.
3. క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్‌ఆప్స్ ఇంజినీర్
వివరణ: క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో (AWS, Azure, GCP) అప్లికేషన్‌లు, మౌలిక సదుపాయాలను అమలు చేయడం, నిర్వహించడం.
ప్రారంభ జీతం (అంచనా): ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు.
అవసరమైన నైపుణ్యాలు: Linux, నెట్‌వర్కింగ్, క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సర్టిఫికేషన్‌లు, డాకర్ వంటి ఆటోమేషన్ సాధనాల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
4. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
వివరణ: SEO, SEM, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ ద్వారా ఆన్‌లైన్‌లో బ్రాండ్ ఉనికి, ఆదాయాన్ని పెంచడం.
ప్రారంభ జీతం (అంచనా): సంవత్సరానికి ₹3 లక్షల నుంచి ₹7 లక్షల వరకు (ఇ-కామర్స్ లేదా స్టార్టప్‌లలో పనితీరు ఆధారిత బోనస్ ఉంటుంది).
అవసరమైన నైపుణ్యాలు: Google Analytics, SEO సాధనాలు, కంటెంట్ సృష్టి, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
5. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విశ్లేషకుడు / ఈక్విటీ పరిశోధన
వివరాలు: కార్పొరేట్ విలీనాలు, సముపార్జనలు (M&A), మూలధన సేకరణ, స్టాక్ మార్కెట్ ధోరణుల లోతైన విశ్లేషణ.
ప్రారంభ జీతం (అంచనా): ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ. ₹18 లక్షల వరకు (బోనస్ అదనంగా ఉంటుంది).
అవసరమైన నైపుణ్యాలు: బలమైన ఆర్థిక నమూనా, అకౌంటింగ్ పరిజ్ఞానం, ఎక్సెల్ నైపుణ్యం, ఎక్కువ గంటలు పని చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
READ ALSO: Donald Trump: అమెరికా అధ్యక్షుడికి ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బ.. పాపం ట్రంప్!