బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురును అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్బీఐ కాంకరెట్ ఆడిటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1194 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే ఛాన్స్ కల్పించింది. ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి..
ఎస్బీఐ కాంకరెట్ ఆడిటర్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ పొందిన తరువాత బ్యాంక్ సర్వీస్ నుండి రిటైర్ అయి ఉండాలి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన లేదా సస్పెండ్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు కాదు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 15 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.