RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
- రైల్వేలో 6,557 ఉద్యోగాలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది
- జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. RRB Technician Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. పదో తరగతి, డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని పోస్టులు?
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 6,557 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ – 323 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్-III – 6,234 పోస్టులు.
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
విద్యార్హతలు
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న సమాన అర్హత ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI / ఇతర నిర్దేశిత సాంకేతిక అర్హతలు ఉండాలి. (పూర్తి అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.)
వయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్-I: 18 నుంచి 33 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్-III: 18 నుంచి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు. ఇతర కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: జూన్ 30, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 31, 2026
దరఖాస్తు సవరణలు: ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10, 2026
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.
జీతం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం చెల్లిస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-I: నెలకు రూ.29,200.టెక్నీషియన్ గ్రేడ్-III: నెలకు రూ.19,900. వీటికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్ తదితర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి.
తాజావార్తలు
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!