RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
- రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు
- దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై, 2026 జూలై 29 చివరి తేదీ వరకు
- బి.ఎస్.సి./బి.టెక్./బి.ఇ./3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు భారతీయ రైల్వే తీపికబురును అందించింది. ఏకంగా 6 వేలకు పైగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 6,565 ఖాళీగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయడానికి షాట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై, 2026 జూలై 29 చివరి తేదీ వరకు కొనసాగుతుంది. నోటిఫికేషన్ ప్రకారం, ఆర్ఆర్బి 323 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు, 6242 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హతలు
Also Read
- Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
ఆర్.ఆర్.బి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సంబంధిత రంగంలో బి.ఎస్.సి./బి.టెక్./బి.ఇ./3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. 33 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటిఐ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకానికి ఎంపిక కావడానికి, అభ్యర్థులు ముందుగా CBT పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. విజయవంతమైన అభ్యర్థులను ఆ తర్వాత పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్ష కోసం ఆహ్వానిస్తారు. అన్ని దశలలోనూ ప్రతిభచూపిన అభ్యర్థులకు ఖాళీగా ఉన్న స్థానాలలో నియామకాలు చేపట్టడం జరుగుతుంది.
ఈ నియామకం ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 జీతం లభిస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 జీతం లభిస్తుంది. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్‌తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు.. ఆ బ్యాటర్‌పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!