RRB NTPC 2025: రైల్వే జాబ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూ్స్. రైల్వేలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ స్టేషన్ మాస్టర్స్ కోసం 615 ఉద్యోగాలతో సహా మొత్తం 8,850 ఉద్యోగాలను కవర్ చేస్తుంది. అసలు ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్, ఫీజు వివరాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Hema : ఎవరినైనా చంపేయాలి అనిపించేది : హేమ
ఏయే పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే..
తాజా పోస్టుల్లో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. వీటికి గ్రాడ్యుయేట్ పూర్తి అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు మొత్తం 5,817 ఖాళీలు ఉన్నాయి, వీటితో పాటు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పదవులకు అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు మొత్తం 3,058 ఖాళీలు ఉన్నాయి. వీటి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21, 2025 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 20, 2025 చివరి తేదీ. ఆసక్తిగల వారు rrbcdg.gov.in వెబ్‌సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
వయోపరిమితి..
NTPC గ్రాడ్యుయేట్ స్థాయి: కనీస వయోపరిమితి 18 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి 36 ఏళ్లు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
NTPC అండర్ గ్రాడ్యుయేట్ (12వ తరగతి ఉత్తీర్ణత): కనీస వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లు. నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ. 500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మాజీ సైనికులు – రూ. 250
READ ALSO: Putin Warning US: అమెరికాకు పుతిన్ వార్నింగ్.. సంబంధాలను నాశనం చేస్తుందని హెచ్చరిక!