CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్/డ్రైవర్ జాబ్స్ మీవే
- పదో తరగతి అర్హతతో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్/డ్రైవర్ జాబ్స్
- ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1124 పోస్టులను భర్తీ
- దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 04
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం వచ్చింది. జస్ట్ మీరు టెన్త్ పాసైతే చాలు కానిస్టేబుల్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆద్వార్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్/ డ్రైవర్ పోస్టులు 845, కానిస్టేబుల్/డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ 279 పోస్టులున్నాయి.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 04/03/2025నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాల విషయానికి వస్తే.. ఎత్తు 167 సెం.మీలు, ఛాతి 80-85 సెం.మీలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read
- RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
- RRB Station Master Recruitment 2026: రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు!
ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి 69,100 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 4 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ cisfrectt.cisf.gov.in పై క్లిక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!