గవర్నమెంట్ జాబ్ సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. సరైన ప్రణాళిక, డెడికేషన్ ఉంటే తప్పా జాబ్ పొందలేరు. 30 వేల శాలరీ వచ్చే ఉద్యోగాలకు పోటీ ఎక్కువ, లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యగాలకు పోటీ తక్కువ ఉంటుంది. మరి మీరు కూడా లక్ష రూపాయల జీతంతో మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం గ్రూప్ సీ, డీలో 4576 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
భర్తీకానున్న పోస్టుల్లో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్ వంటి మొత్తం 66 రకాల పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 19,900 నుంచి రూ. 92,300 ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు రూ.3000 చెల్లించాలి. SC, ST, EWS అభ్యర్థులకు రూ.2,400 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయంపునిచ్చారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం www.aiimsexams.ac.inపై క్లిక్ చేయండి. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నవారు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.