మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో కానిస్టేబుల్/డ్రైవర్ (డైరెక్ట్ ఎంట్రీ) 845, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్): 279 పోస్టులు ఉన్నాయి.
Also Read:Pawan Kalyan South Indian Temples Tour: జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్.. ఆలయాల పర్యటన ఖరారు
పదో తరగతి పాసై ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులు సీఐఎస్ఎఫ్ జాబ్స్ ను అస్సలు వదులుకోకండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. దీనితోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా కలిగి ఉండాలి. వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Jay Shah: ప్రాణాలను కాపాడండి.. జై షా పోస్ట్ వైరల్!
ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 అందిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ (ఈఎస్‌ఎం) అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 4 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.