బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంకు జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 10 పోస్టులున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం పొందొచ్చు.
మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ జాబ్ కొట్టి మీ లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. స్థానిక భాషపై పట్టుండాలి. అభ్యర్థుల వయసు 01.01.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.
ఈ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్(స్కేల్-1) కింద నెలకు రూ.48,480 – రూ.85,920 వరకు జీతం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 5 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.