ఇండియన్ ఆర్మీలో సేవ చెయ్యాలానుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..ఆర్మీలో వివిధ ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ ఆర్మీ తాజాగా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..పెళ్లికాని మహిళలు, స్త్రీలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు…ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ joinindianarmy.nic.in ద్వారా జులై 19లోపు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి..
మొత్తం ఖాళీలు :
SSC (టెక్) పురుషులు- 175
SSC (టెక్) మహిళలు- 19
SSCW టెక్ & నాన్ టెక్- 2
అర్హతలు :
అభ్యర్థుల వయసు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు…
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా ఇండియన్ ఆర్మీ అధికార పోర్టల్ ను విజిట్ చేసి, హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ఆఫీసర్ ఎంట్రీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవసరమైన అన్ని వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.. డాక్యుమెంట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
ఇకపోతే ముందుగా వచ్చిన అప్లికేషన్స్‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తిచేసే అభ్యర్థులకు మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు… ఆ తర్వాత మళ్లీ టెస్టులు ఉంటాయి.. ఈ ఉద్యోగాలకు వయస్సు 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండాలి.. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..