India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Post GDS : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో జులై 2026 సెషన్‌కు సంబంధించి 25,000 కంటే ఎక్కువ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడుతుండటం వల్ల, మంచి మార్కులు పొందిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా నిలవనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్ స్థానిక భాషను చదివి ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండాలి. దీనితో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు లభిస్తుంది.
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 2, 2026 నుండి సెప్టెంబర్ 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి బిపిఎమ్ (BPM) హోదాకు రూ.12,000 నుండి రూ.29,380 వరకు, ఎబిపిఎమ్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుండి రూ.24,470 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు అప్లై చేస్తే దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!