తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిప్యూటీ మేనేజర్ జనరల్, మేనేజర్, హౌజ్ కీపర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..
పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది.. ఇక ఈ పోస్టులకు అర్హతల విషయానికొస్తే.. పోస్టుల ఆధారంగా టెన్త్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అభ్యర్థుల వయస్సు 30-45 ఏళ్లు ఉండాలి… ఈ ఉద్యోగాలకు జీతాలు.. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.19130 నుంచి రూ.2.2 లక్షల వేతనం ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్: అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు http://www.midhani-india.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చెయ్యగలరు.. గతంలో కూడా ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ కు మంచి స్పందన వచ్చింది.. దాంతో ఈ ఏడాది రెండు సార్లు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేశారు.