EMRS Recruitment: నిరుద్యోగులకు శుభవార్త..4,602 పోస్టులకు ఉద్యోగాలు..జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. మొత్తం 4,062 ఖాళీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివ్ లో ఉంది. వీటిల్లో కొన్ని పోస్టులను అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 30 కాగా.. మరికొన్ని పోస్టులకు ఆగస్టు 18 వరకూ సమయం ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు: 2266 పోస్టులు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్: 373 పోస్టులు
అకౌంటెంట్: 361 పోస్టులు
ప్రిన్సిపాల్: 303 పోస్టులు
Also Read
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
అర్హతలు: పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ)లకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
ప్రిన్సిపల్ పోస్ట్‌కి గుర్తింపు కలిగిన సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉండాలి. ఏదైనా సంస్థలో వైస్ ప్రిన్సిపాల్ గా కనీసం 12 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.ఒకవేళ పీజీటీ లేదా టీజీటీ అయితే కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఇకపోతే ప్రిన్సిపల్ పోస్టుకి అప్లికేషన్ ఫీజు రూ. 2000, అలాగే పీజీటీకి రూ. 1500, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు రుసుము రూ. 1000 ఉంటుంది. అయితే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు పొందుతారు.
ఎలా దరఖాస్తూ చేసుకోవాలంటే?
అభ్యర్థులు ముందుగా ఈఎంఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.. దానిలోని హోమ్ పేజీలో కెరీర్/నోటిఫికేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఈఎంఆర్ఎస్ రిక్రూట్ మెంట్ 2023 అప్లికేషన్ ఫారం ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను పూరించాలి. ఒకసారి వివరాలు అన్ని సరిచూసుకొని, పేమెంట్ చేయాలి.
కేటగిరీ వైజ్ గా సూచించిన మొత్తాన్ని ఫీజుగా చెల్లించాలి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరచుకోవాలని అధికారులు చెబుతున్నారు.. అప్లై చేసిన తర్వాత ఈఎంఆర్ఎస్ వెబ్ సైట్, అలాగే అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఈ-మెయిల్ ఇన్ బాక్స్ ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి..
ఇకపోతే ఇక్కడ సెలెక్ట్ అయిన వెంటనే పోస్టింగ్ ఇస్తారు..ఒక్కో పోస్ట్ కు ఒక్కో రకంగా జీతం ఇస్తారు..
1. ప్రిన్సిపాల్-లెవల్ 12(రూ.78,800 నుంచి రూ.2,09200)..
2. పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ)- లెవెల్ 8( రూ. 47,600 నుంచి రూ.1,151100)..
3. అకౌంటెంట్-లెవల్ 6(రూ. 35,400 నుంచి రూ. 112400)
4. జేఎస్ఏ- లెవెల్2(రూ. 19,900 నుంచి రూ. 63,200)
ల్యాబ్ అటెండెంట్- లెవెల్ 1(రూ. 18,000 నుంచి 56,900)..
ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను అధికార వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?