NSPG Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.15 వేలు మీ అకౌంట్లోకే.. అస్సలు వదులుకోవద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSPG Scholarship: కేంద్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ను ప్రారంభించింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆలోచిస్తుంటే, ఫీజులు, బోర్డింగ్ లేదా పుస్తకాల కొనుగోలు గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్కాలర్షిప్ మీకు విశేషంగా ఉపయోగపడుతుంది. దీని కింద మీకు ప్రతి నెలా రూ.15 వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ స్కాలర్షిప్ డబ్బులు మీకు రెండు సంవత్సరాలు వస్తాయి. ఈ స్కాలర్షిప్ను నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనే పేరుతో పిలుస్తారు. దీని ఉద్దేశం.. ఆర్థిక పరిమితుల కారణంగా చదువును కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు సహాయం చేయడం. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
NSPG స్కాలర్షిప్ అంటే..
ఈ స్కాలర్షిప్ భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 10 వేల మంది పీజీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 10 నెలల పాటు నెలకు రూ.15 వేలు అందిస్తారు. అంటే సంవత్సరానికి సుమారు రూ.1.5 లక్షలు, రెండు సంవత్సరాలలో రూ.3 లక్షల వరకు అందుతుంది. ఈ డబ్బు నేరుగా విద్యార్థి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలో ప్రతీ నెల జమ అవుతుంది.
* మొదటిసారి పీజీ కోర్సు చేస్తున్న విద్యార్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే పీజీ పూర్తి చేసి ఉంటే, దీనికి అప్లై చేయడానికి మీరు అర్హులు కారు.
* విద్యార్థి గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్, పూర్తి సమయం పీజీ కోర్సులో ప్రవేశం పొందాలి.
* ఓపెన్, డిస్టెన్స్, పార్ట్ టైమ్ లేదా ప్రైవేట్ మోడ్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తించదు.
* పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందే సమయానికి విద్యార్థి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
* UGC గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు.
* ఈ స్కాలర్షిప్లో ప్రభుత్వం 30% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది.
* ఈ స్కాలర్షిప్కు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆసక్తిగల విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేద్దామని అనుకుంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. UGC వెబ్సైట్లో ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ చేస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు, విద్యార్థులు తమ వివరాలను జాగ్రత్తగా నింపాలి. పేరు, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా IFSC కోడ్‌లో చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే.. మీ అప్లికేషన్ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీనికి అప్లై చేసే టైంలో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని పలువురు నిపుణులు సూచించారు.
READ ALSO: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..