RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడే అప్లై చేసుకోండి
- రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
- ఆన్ లైన్ విధానంలో మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 22తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే రైల్వే జాబ్ సాధించే ఛాన్స్ మిస్ చేసుకోకండి.
Also Read:Harish Shankar: చిన్న సినిమాలో హరీష్ శంకర్
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
32,438 ఉద్యోగ ఖాళీల్లో.. 13,187 ట్రాక్ మెయింటైన్ పోస్టులు, పాయింట్స్ మెన్ ఉద్యోగాలు 5,058, అసిస్టెంట్ ఉద్యోగాలు 3,077 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయనునున్నారు. RRB గ్రూప్ D పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT నుంచి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 36 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
Also Read:Dandora: దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ‘దండోరా’ …ఫస్ట్ బీట్ వీడియో!
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. సీబీటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ పీహెచ్/ఈబీసీ, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు