AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్-2026 అమలుకు వేగం పెంచింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలను త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే తొలి దశలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెండో దశలో 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదట ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులతో వాయిదా పడింది.
అక్టోబర్ 15న మూడో, నాలుగో దశల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన జాబ్ క్యాలెండర్-2026 సమీక్ష సమావేశంలో మంత్రుల బృందం, అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాఖల అవసరాలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టాలని సూచించారు మంత్రి లోకేష్..
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
మూడో దశలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అధిక భాగం హోంశాఖకు సంబంధించిన పోస్టులేనని అధికారులు తెలిపారు. అలాగే గ్రూప్-1లో ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు చేర్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!