Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Youngest T20 Captain: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా (15 ఏళ్ల 232 రోజులు) రికార్డు సృష్టించాడు. శనివారం (నవంబర్ 14) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 తొలి మ్యాచ్‌లో బిహార్ జట్టుకు బుడ్డోడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దాంతో ఈ అరుదైన రికార్డు అతడి ఖాతాలో చేరింది. తన మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన వైభవ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బిహార్ జట్టు రంజీ ట్రోఫీ తొలి దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టోర్నీలో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు. అనంతరం ఎమర్జింగ్ ఆసియా కప్ 2026లో పాల్గొనే భారత జట్టుతో కలవనున్నాడు. బిహార్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడంపై వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు. తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైన స్థాయి నుంచి ఇప్పుడు సొంత రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎదగడం గొప్ప విజయమని పేర్కొన్నాడు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read
- Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
- Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
- IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
- Gautam Gambhir: "మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది".. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
వైభవ్‌కు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇషాన్ గాయంతో మైదానాన్ని వీడిన సమయంలో జట్టును నడిపించాడు. ఆ టోర్నీ ఫైనల్లో సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. గత ఏడాది కాలంగా వైభవ్ అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.
ఆ తర్వాత ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు. 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనలతో అతడికి భారత టీ20 జట్టులోనూ చోటు దక్కింది. జూలైలో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. వైభవ్ ఇప్పటివరకు జపాన్, ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే స్వదేశంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో మొత్తం 44 మ్యాచ్‌లు ఆడిన అతడు.. అందులో బిహార్ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై 61 బంతుల్లో అజేయంగా 108 పరుగులు సాధించాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. భారత వన్డే జట్టులో వైభవ్‌కు చోటు లేదు. రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ తరఫున ఆడే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!