Site icon NTV Telugu

Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు

Zelenskyy

Zelenskyy

ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు. యుద్ధం ముగింపునకు ప్రపంచ దేశాలు సహకరించాలని కోరారు. శాంతికి సహకరిస్తారా? లేదంటే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ

తమపై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోందని.. ఈ తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ యుద్ధం మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు. యూరప్ అంతటా రష్యా డ్రోన్లు ఎగురుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని వాపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

2022, ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఏకధాటితో యుద్ధం సాగుతూనే ఉంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అయినా కూడా యుద్ధం ఆగలేదు. పుతిన్ పెట్టే షరతులు కారణంగా శాంతి ఒప్పందం ముందుకు సాగడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య నిత్యం బాంబు దాడులు జరుగుతూనే ఉంటున్నాయి.

Exit mobile version