Site icon NTV Telugu

Xi Jinping: జిన్‌పింగ్‌ అదృశ్యం.. ఈ ఆరుగురి నుంచే చైనా కొత్త అధ్యక్షుడు..

Xi Jinping

Xi Jinping

Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తల ప్రకారం, త్వరలో జిన్‌పింగ్ గద్దె దిగిపోవడం ఖాయమని, కొత్తగా మరో అధ్యక్షుడు చైనా పగ్గాలు చేపడుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, తర్వాత చైనాకు కాబోయే అధ్యక్షుడుల్లో ఆరుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

జనరల్ జాంగ్ యూక్సియా:

జనరల్ జాంగ్ చైనా శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి ఉపాధ్యక్షుడు. చైనీస్ ఆర్మీలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి. మాజీ చైనా ప్రెసిడెంట్ హూజింటావోకు అనుచరుడిగా పేరుంది. జిన్‌పింగ్ తర్వాత ఇతడి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.

లి క్వియాంగ్:

లి క్వియాంగ్ ప్రస్తుతం చైనా ప్రధానిగా ఉన్నారు. 2023 నుంచి అధికారంలో ఉన్నారు. స్టేట్ కౌన్సిల్ అధిపతిగా చైనా ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తివంతమైన నేతగా పేరుంది.

డింగ్ షుజియాంగ్:

షి జిన్‌పింగ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన డింగ్‌ను ఆయన సన్నిహిత సహాయకుడిగా భావిస్తారు. జిన్‌పింగ్ పాలనాకాలంలో ఇతను శక్తివంతమైన నేతగా వేగంగా ఎదిగారు. జిన్‌పింగ్ ఆశీర్వాదాలు ఇతడికి ఉన్నాయని భావిస్తారు.

వాంగ్ హునింగ్:

ప్రస్తుతం వాంగ్ చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్. వాంగ్ పార్టీ ప్రధాన సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందారు. ఇతను ముగ్గురు అధ్యక్షుల కింద పనిచేశారు. అయితే, ఈయనకు పాలనా అనుభవం లేకపోవడంతో, ఇతను కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జావో లెజి:

అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మాజీ నాయకుడు. జావో పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో సీనియర్ సభ్యుడు, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

లి హాంగ్‌జోంగ్:

సీనియర్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేత. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లి హాంగ్‌జోంగ్ కూడా రేసులో ఉన్నారు. పార్టీ నిర్మాణం ఈయనకు మంచి పట్టు ఉందని చెబుతారు. జిన్‌పింగ్‌కు విశ్వాసపాత్రుడనే పేరు ఉంది.

Exit mobile version