Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.