కాబూల్ ఎయిర్ పోర్టులో దారుణ పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. తాలిబన్లు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయ్. విమానాశ్రయం లోపల తాలిబన్లు…హాయిగా సేద తీరుతున్నారు. నాటో దళాలు ఉపయోగించిన ప్రత్యేక దుస్తులు, ఇతర సామాగ్రి…చిందరవందరగా పడిపోయింది. బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయ్. వీటిలో పనికి వచ్చే వాటిని…తాలిబన్లు ఏరుకుంటున్నారు. యుద్దానికి ఉపయోగించిన హెలికాప్టర్లు పనికిరాకుండా పోయాయ్. జీపులు, ట్రక్కులు…ధ్వంసమయ్యాయి.
తాజాగా కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం…తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ విమాన సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఎయిర్ లైన్స్ స్టేషన్ అధికారులు తెలిపారు. అరియానా అప్గాన్ విమాన సంస్థ కాబూల్ నుంచి…మూడు ప్రావిన్స్‌లకు విమానాలు నడుపుతోంది. హెరాత్, దక్షిణ కాందహార్, ఉత్తర బల్క్ ప్రావిన్స్‌లకు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లనున్నాయ్. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు…ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్‌కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
ఆగస్టు నెలాఖరులో అమెరికన్ బలగాల నిష్ర్కమణతో హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కాబూల్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఆగస్టు 30 అర్ధరాత్రి అమెరికాకు చెందిన ఆఖరు విమానం లార్జ్ సీ-17 టేకాఫ్ అయింది. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన అనంతరం.. అఫ్గాన్‌ను వదిలి వెళ్లేందుకు వేలాది మంది ప్రజలు ఈ విమానాశ్రయానికి పోటెత్తారు. కాల్పులు, తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లతో విమానాశ్రయంతోపాటు పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!