World War-3: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World War-3: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఆ దేశానికి చెందిన ఇద్దరు కీలక సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనిక అధికారులను హతమార్చింది. అయితే, ఈ ఘటన తర్వాత నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది.
Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
Also Read
ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్(ట్విట్టర్)లో ‘‘వరల్డ్ వార్-3’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ 51 వేల కన్నా ఎక్కువ పోస్టుల రాగా, నెటిజన్లు ఇరాన్, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇరాన్‌కి మద్దతుగా చైనా, రష్యా, ఉత్తర కొరియా ఉంటాయని, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నాటో, అమెరికా, యూకేల కూటములుగా ఏర్పడుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు తమకు నచ్చినట్లుగా ఈ రెండు దేశాలకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, ఈ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని, తన ప్రాక్సీలైన హమాస్, హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లతో తమపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ ఘర్షణలే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!