World War 3: మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా బైడెన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ వరకూ పాకింది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే దాని ప్రభావం అంచనా వేయడం కష్టం. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా ఏడాదికి పైగా పోరాడుతోంది. ఇప్పుడు రష్యాకు ఉత్తర కొరియా తోడైంది.. ఇక తైవాన్ పై చైనా కాలు దువ్వుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం…
ఇజ్రాయెల్ దూకుడును లెక్కచేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ మంగళవారం రాత్రి వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది.
World War-3: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఆ దేశానికి చెందిన ఇద్దరు కీలక సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనిక అధికారులను హతమార్చింది.
World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని బిల్డ్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది నాటో మిత్రదేశాలపై దాడి చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించగలదని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తాపత్రిక పేర్కొంది.