NTV Telugu Site icon

World War-3: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3

World War 3

World War 3

World War-3: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఆ దేశానికి చెందిన ఇద్దరు కీలక సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనిక అధికారులను హతమార్చింది. అయితే, ఈ ఘటన తర్వాత నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది.

Read Also: PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..

ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్‌(ట్విట్టర్)లో ‘‘వరల్డ్ వార్-3’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ 51 వేల కన్నా ఎక్కువ పోస్టుల రాగా, నెటిజన్లు ఇరాన్, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇరాన్‌కి మద్దతుగా చైనా, రష్యా, ఉత్తర కొరియా ఉంటాయని, ఇజ్రాయిల్‌కి మద్దతుగా నాటో, అమెరికా, యూకేల కూటములుగా ఏర్పడుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు తమకు నచ్చినట్లుగా ఈ రెండు దేశాలకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, ఈ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని, తన ప్రాక్సీలైన హమాస్, హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లతో తమపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ ఘర్షణలే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Show comments