కరోనా మహమ్మారి వరసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటివేవ్లో పెద్దగా ప్రభావం చూపని కరోనా, సెకండ్ వేవ్‌లో వీర విజృంభణ చేస్తోంది. ప్రతి దేశంపై కరోనా తన ప్రభావాన్ని చూపుతున్నది. ఎవరిలోనైతే రోగనిరోధక శక్తి తక్కువగా, ప్రాణాంతకమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారో వారిపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అయితే, ఇప్పటి వరకు హెచ్.ఐ.వీ సోకిన వ్యక్తుల్లో కరోనా సోకుతున్నట్టు వార్తలు లేవు. మొదటిసారి ఇలాంటి కేసులు దక్షిణాఫ్రికా దేశంలో బయటపడుతున్నాయి. క్వాజులు నాటాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు హెచ్.ఐ.వీ సోకింది. అప్పటి నుంచి ఆమె వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వస్తున్నది. అయితే, సదరు మహిళకు గతేడాది సెప్టెంబర్ నెలలో కరోనా సోకింది. ఆ తరువాత ఆమె ఆసుపత్రితో చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 216 రోజులపాటు సదరు మహిళలో కరోనావైరస్ ఉండటం వైద్యులను షాక్ కు గురిచేసింది. అంతేకాదు, ఆమెలో కరోనా 32 మ్యూటేషన్లు ఉన్నాయని వైద్యనిపుణులు గుర్తించారు. ఇందులో ప్రాణాంతకమైన ఈ404కె రకం వేరియంట్ ఉండటం ఆంధోళన కలిగిస్తోంది. క్వాజులు నటాల్ ప్రాంతానికి చెందిన వయోజనుల్లో ఎక్కువ మందికి హెచ్.ఐ.వీ ఉండటంతో ఆ ప్రాంతంపై అధికారులు దృష్టిసారించారు.