విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు.
Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్ హీరో ఎంట్రీ!
విమానం ప్రయాణం చేస్తున్న సమయంలో పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. తనను కిందకు దించాలని, డోర్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది అమెను బలవంతంగా సీటుకు కట్టేశారు. దీనికి సంబందించిన దృష్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరల్ గా మారాయి. ఇక, విమానం గమ్యస్థానం చేరుకున్నాక భద్రతా సిబ్బంది ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.